News September 19, 2024

YSRను తిట్టినవారికే మంత్రి పదవులు ఇచ్చారు: బాలినేని

image

AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్‌ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్‌ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Similar News

News December 29, 2025

రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా ఈ అర్ధరాత్రి నుంచి తిరుమలలో ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

News December 29, 2025

క్యాబినెట్ సమావేశం ప్రారంభం..

image

AP: సీఎం CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 20 అజెండాలపై చర్చించనుంది.
*అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి రూ.7,387 కోట్ల రుణాలు
*అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ
*ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థికశాఖ అనుమతికి ఆమోదం
*గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్
*జిల్లా కోర్టుల్లో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు

News December 29, 2025

ఈ మెడిసిన్ కొంటున్నారా?

image

అనారోగ్యానికి గురైన సమయంలో తీసుకునే కొన్ని ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్‌పై ఉండే ఎర్రటి గీతను ఎప్పుడైనా గమనించారా? రెడ్‌లైన్ ఉంటే వైద్యుడి సలహా లేకుండా వినియోగించకూడదని కేంద్రం చెబుతోంది. యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన తీసుకోవడం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌‌కు దారితీస్తుందని హెచ్చరించింది. ఇలాంటి విషయాల్లో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. మెడిసిన్ కొనే సమయంలో గడువు తేదీతో పాటు రెడ్ లైన్‌ను గమనించండి.