News September 19, 2024

అశ్విన్ హాఫ్ సెంచరీ

image

బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్ అశ్విన్ అదరగొడుతున్నారు. టాప్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై బ్యాటుతో రాణించి హాఫ్ సెంచరీ చేశారు. 58బంతుల్లో 50 రన్స్ చేశారు. 144/6 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మరో ఎండ్‌లో జడేజా(34) ఉన్నారు. వీరిద్దరు 102 బంతుల్లో 89 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 233/6గా ఉంది.

Similar News

News November 4, 2025

న్యూస్ రౌండప్

image

☛ జూబ్లీహిల్స్ బైపోల్: బీజేపీకి జనసేన మద్దతు
☛ రైతులను కలిసే అర్హత జగన్‌కు లేదు: మంత్రి నిమ్మల
☛ కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. గోవాలో పని చేస్తున్న శిబూ, జనేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
☛ బిహార్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం.. నవంబర్ 6న తొలి విడత పోలింగ్
☛ శ్రీకాకుళం: విద్యార్థుల చేత <<18193619>>కాళ్లు నొక్కించుకున్న<<>> టీచర్ సస్పెండ్
☛ ఎంపీ చిన్నితో ముగిసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణ

News November 4, 2025

సిగాచీ బాధితులకు ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు: హైకోర్టు

image

TG: సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన బాధితులకు పరిహారం చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బాధితులకు ఇస్తామన్న ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. మృతుల కుటుంబాలకు ₹25లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా మొత్తం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఏజీ తెలిపారు. 2 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యాక్టరీ ఎండీకి నోటీసులు జారీ చేసింది.

News November 4, 2025

త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ

image

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను నమోదు చేసింది. ఈ FYలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే(రూ.18,331 కోట్లు) 10% వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం 3% పెరిగి రూ.42,985 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో SBI షేర్లు స్వల్పంగా లాభపడి రూ.954.6 వద్ద ముగిశాయి.