News September 19, 2024
జగన్ నీ సంగతి స్వామే చూసుకుంటాడు: టీడీపీ

మాజీ CM YS జగన్‌పై టీడీపీ ట్విటర్‌లో మండిపడింది. స్వామి వారి విగ్రహాన్ని నల్ల రాయి అని పగలగొడతా అని చెప్పిన అన్యమతస్థుడైన భూమనకు TTD ఛైర్మన్ పదవి ఇచ్చారంటూ ఆరోపించింది. ‘ జగన్ రెడ్డీ.. తిరుమల గురించి నువ్వు, నీ సైకో బ్యాచ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత దుర్మార్గుడివి కాకపోతే తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతావా? ఆయన పవర్ తెలిసి కూడా ఆటలు ఆడావు. ఆయనే చూసుకుంటాడు’ అని హెచ్చరించింది.
Similar News
News February 2, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ షాకిచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని 68వేల మంది ఎంప్లాయిస్ జీతాలను నిలిపివేసింది. మానవ సంపద పోర్టల్‌లో గవర్నమెంట్ ఉద్యోగుల స్థిర, చరాస్తుల వివరాల వెల్లడికి JAN-31 వరకు గడువు ఇచ్చింది. అయితే ఆ వివరాలను అప్‌లోడ్ చేయని 34,926 మంది గ్రూప్-C, 22,624 మంది గ్రూప్-D, 7,204 మంది గ్రూప్-B, 2,628 మంది గ్రూప్-A అధికారుల శాలరీలను సర్కారు ఆపేసింది.
News February 2, 2026
గోధుమ పిండి దీపంతో వివాదాల పరిష్కారం

అనుకోని వివాదాలు, కోర్టు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఈ దీపారాధన వల్ల శత్రు చికాకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్య గ్రహ దోషాలు ఉన్నా, అధికారులతో ఇబ్బందులు ఎదురైనా గోధుమ పిండి దీపం ఉపశమనాన్ని ఇస్తుంది. మనశ్శాంతిని ప్రసాదించి, క్లిష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. సమస్యల తీవ్రత తగ్గాలనుకునే వారు ఈ దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగించాలి.
News February 2, 2026
జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ జార్జియాలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. డెరెక్టర్ రాజమౌళి దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారట. అలాగే మరో కీలక షెడ్యూల్‌ను అంటార్కిటికాలో చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.


