News September 20, 2024
‘పుష్ప 2’లో డేవిడ్ వార్నర్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వార్నర్ కేమియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా బన్నీ సినిమాలకు సంబంధించిన రీల్స్ చేసి వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Similar News
News December 29, 2025
నేటి నుంచి యాప్ ద్వారా యూరియా పంపిణీ: విజయనిర్మల

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి యాప్ ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల తెలిపారు. వానాకాలం యూరియా పంపిణీలో రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ రూపొందించిందని పేర్కొన్నారు. ప్లే స్టోర్ ద్వారా యూరియా బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తమ ఫోన్ నంబర్‌తో లాగిన్ చేసుకోవాలన్నారు. పట్టా పాస్ బుక్ నంబర్ నమోదుతో యూరియా తీసుకోవా లన్నారు.
News December 29, 2025
ఇంటర్ అర్హతతో 394 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

NDA, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026కు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ పరీక్ష ద్వారా UPSC త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్ (MPC) ఉత్తీర్ణులు అర్హులు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: upsc.gov.in/ *మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 29, 2025
IIT ధన్‌బాద్‌లో 105 పోస్టులు… అప్లై చేశారా?

<


