News September 20, 2024

వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్

image

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

Similar News

News November 8, 2025

విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.

News November 8, 2025

విశాఖ: నిర్మాణాల వద్ద వాలిపోతున్న చోటా నేతలు

image

సొంత ఇంటి నిర్మాణం మధ్యతరగతి కుటుంబాల కల. విశాఖలో కొందరు చోటా నాయకులు తమ ఆగడాలతో సామాన్యుల కలను చిదిమేస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే GVMCకి ఫీజులు చెల్లించి, టౌన్ ప్లానింగ్ అనుమతి తీసుకుంటే చాలు. కానీ ఈ నాయకులు ప్రజల నుంచి ముడుపులు వసూలు చేస్తుండటంతో.. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఓ ఇంటి యజమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. నగరంలో వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.

News November 8, 2025

KGHలో పవర్ కట్.. ప్రభుత్వం సీరియస్

image

KGHలో గురువారం 10 గంటలపాటు కరెంట్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఛైర్మన్‌గా ఉన్న ఈ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ అంతరాయం జరగడంపై ఆరోగ్యశాఖ సీరియస్‌ అయింది. కాగా.. కనీసం జనరేటర్లు కూడా సమకూర్చలేరా అంటూ YCP ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపింది. ‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది’అంటూ YCP నేతలు విమర్శలు గుప్పించారు.