News September 20, 2024

కూటమి పాలనకు 100 రోజులు.. ‘ఇది మంచి ప్రభుత్వమేనా?’

image

AP: కూటమి పాలనకు నేటితో 100 రోజులు పూర్తవడంతో 26వ తేదీ వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో MLAలు క్యాంపెయిన్ చేయనున్నారు. పెన్షన్ల పెంపు, మెగా DSC, అన్న క్యాంటీన్లు, అమరావతి, పోలవరానికి నిధులు, ‘ల్యాండ్ టైటిలింగ్’ రద్దు తదితర 100 కార్యక్రమాలు చేశామని నేతలు చెబుతున్నారు. ‘సూపర్-6’ ఊసు లేదని, ప్రత్యర్థులపై దాడులు, హత్యలు తప్ప చేసిందేమీ లేదని YCP విమర్శిస్తోంది. మీరేమంటారు? ఇది మంచి ప్రభుత్వమేనా?

Similar News

News September 20, 2024

Stock Market: గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. NSE నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 25,468, BSE సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 83,275 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. నిన్న విలవిల్లాడిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నేడు రేంజ్‌బౌండ్లో ట్రేడవుతున్నాయి. JSW స్టీల్, HDFC లైఫ్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్.

News September 20, 2024

పెళ్లి పేరుతో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు!

image

పెళ్లి పేరుతో ఓ జడ్జి సహా 50మందికి పైగా మహిళల్ని మోసం చేసిన UP వ్యక్తి ముకీమ్‌ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ క్రియేట్ చేసి ఫేక్ IDలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. పెళ్లి ఫిక్సయ్యాక మ్యారేజ్ హాల్స్ బుకింగ్, ఇతర కారణాలు చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యేవాడు. పెళ్లి కాని, వితంతు ముస్లిం మహిళల్నే తాను టార్గెట్ చేసినట్లు విచారణలో తెలిపాడు.

News September 20, 2024

రెండో రోజు ఆట మొదలు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. క్రీజులో సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్(102), జడేజా(86) ఉన్నారు. భారత్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.