News September 20, 2024
నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మండలంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరు రోజులపాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.
Similar News
News January 5, 2026
ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తున్నారా?

చలికాలంలో పదేపదే ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుందంటున్నారు నిపుణులు. ప్రతిసారీ సబ్బును వాడటం వల్ల చర్మం.. సహజ నూనెలను కోల్పోతుంది. పీహెచ్ స్థాయి తగ్గడంతోపాటు చర్మంపై రక్షణగా ఉండే పొర కూడా బలహీన పడిపోతుంది. దాంతో స్వేదగ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తూ.. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అలాగే ముఖం ఎక్కువగా కడుక్కోవడం, తుడుచుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.
News January 5, 2026
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: పార్థసారథి

AP: రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. సోలార్, విండ్, బయో విద్యుత్ రంగాల్లో 80గిగావాట్ల విద్యుత్‌ను తక్కువ ధరకు కొనే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు కంప్లీట్ సబ్సిడీ.. బీసీలకు అదనంగా రూ.50వేల రాయితీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.
News January 5, 2026
శివ మానస పూజ ఎలా చేయాలి?

శివ మానస పూజ అంటే ఏ పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుడిని ఆరాధించడం. అందుకోసం ప్రశాంతమైన చోట కూర్చుని కళ్లు మూసుకోవాలి. హృదయమే రత్న సింహాసనమని, ఆత్మయే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలంతో అభిషేకం, కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివుడికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తిమంతమైనది. భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజను ఆచరించవచ్చు.


