News September 20, 2024

‘రూ.99కే క్వార్టర్ మద్యం’పై స్పష్టత కోరిన కంపెనీలు

image

AP: నూతన మద్యం పాలసీలో భాగంగా మంచి బ్రాండ్లు క్వార్టర్ రూ.99కే అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఇది అన్ని బ్రాండ్లకూ ఎలా వర్తిస్తుందని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రేటుకు సరఫరా సాధ్యం కాదంటున్నాయి. అన్ని రకాల మద్యం తక్కువ ధరకే వస్తుందని వినియోగదారులు భావిస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని లిక్కర్ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు కోరారు.

Similar News

News September 20, 2024

నందిగం సురేశ్ ఇంట్లో సోదాలు

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన ఆయనకు కోర్టు తాజాగా మరో 14 రోజులు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్

image

మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో ఈ మ్యాచులను చూడవచ్చు.

News September 20, 2024

ఆయుధాలు వదిలేసి సరెండర్ కండి: అమిత్ షా

image

నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్‌పై ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతామని అమిత్ షా హెచ్చరించారు.