News September 20, 2024

రూ. 4.60 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

image

భారీ గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహా వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేలంపాటలో గణేశుడి చేతిలోని లడ్డు ప్రసాదాన్ని మాజీ వార్డు సభ్యులు గడ్డమీది శ్రీనివాసులు రూ. 4.60 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం వేలాది మంది భక్తులు ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

Similar News

News September 20, 2024

వనపర్తి: BRS సీనియర్ నాయకుడి మృతి

image

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన BRS సీనియర్ నాయకుడు నాగరాల శ్రీనివాస్ రెడ్డి అనారోగ్య కారణంతో శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

News September 20, 2024

మహబూబ్‌నగర్: తండ్రిని చంపేశాడు..!

image

ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు హత్య చేశాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. కాగా రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.

News September 20, 2024

MBNR: మధ్యాహ్న భోజన బిల్లులు రూ.1.94 కోట్లు విడుదల

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడి గుడ్ల కోసం రూ.1.94 కోట్లు విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. దీంతో వంట కార్మికుల ఇబ్బందులు తొలగనున్నాయి.