News September 20, 2024
సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: వాలంటీర్ల అసోసియేషన్

AP: ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ వాలంటీర్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. 100 రోజులుగా కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 2 నుంచి 26 వరకు శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలోగా న్యాయం చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Similar News
News December 27, 2025
U-19 WC: టీమ్ ఇండియా ఇదే..

సౌతాఫ్రికా సిరీస్‌తో పాటు మెన్స్ U-19 WCకు భారత జట్టును BCCI ప్రకటించింది. ఆసియాకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయుశ్ మాత్రేకు మరోసారి బాధ్యతలు అప్పగించింది.
జట్టు: ఆయుశ్(C), విహాన్(VC), వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జి, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వంశ్ సింగ్, అంబ్రీశ్, కనిశ్క్ చౌహన్, ఖిలాన్ పటేల్, మహ్మద్ ఈనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషాన్ సింగ్, ఉధవ్ మోహన్
News December 27, 2025
2026: ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు

వచ్చే ఏడాదిలో బ్యాంకుల సెలవుల జాబితాను RBI వెల్లడించింది. ప్రాంతీయ పండుగలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో సెలవు రోజులు ఇవే..
✮JAN: 15, 26, ✮FEB: No holidays, ✮MAR:3, 19, 20(AP), 21(TG), 27, ✮APRIL: 1, 3, 14, ✮MAY, 1, 27, ✮JUNE: 25(AP), 26(TG), ✮JULY: No holidays, ✮AUG: 15, 25(AP), 26(TG), ✮SEP: 4, 14, ✮OCT: 2, 20, ✮NOV: 24(TG), ✮DEC: 25.
✮ ప్రతి నెలా ఆదివారం, రెండో, నాలుగో శనివారం అదనం.
News December 27, 2025
Money Tip: ఈ లీకులను అరికడితేనే..

తెలియకుండానే మన డబ్బు అనవసర ఖర్చుల రూపంలో వృథా అవుతుంటుంది. వినియోగించని సబ్స్క్రిప్షన్లు, అరుదుగా వెళ్లే జిమ్ మెంబర్‌షిప్‌లు, బ్యాంకు ఛార్జీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బయట భోజనం, ఖరీదైన కాఫీ అలవాట్లను తగ్గించి ఇంట్లోనే తింటే భారీగా ఆదా చేయొచ్చు. ఇలాంటి ఖర్చులను Invisible Leaks అంటారు. వీటిని అరికట్టి ఆదా చేసిన డబ్బును ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తే పెద్దమొత్తంలో సంపదను సృష్టించొచ్చు.


