News September 20, 2024

మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం

image

బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఇటీవల ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన లేని ఓ టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఇక్కడ అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 18, 2026

చిత్తూరు: రేపటి నుంచి పశువైద్య శిబిరాలు

image

జిల్లాలో సోమవారం నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి ఉమామహేశ్వరి తెలిపారు. నెల 31వ తేదీ వైద్య శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. పశువుల ఆరోగ్య రక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ, పోషణ ఖర్చుల తగ్గింపు, అవగాహనకు శిబిరాలు ఉపయోగపడతాయని వెల్లడించారు.

News January 18, 2026

చిత్తూరు: భారీగా పెరుగుతున్న చికెన్ ధరలు

image

చికెన్ ధరలు క్రమేపి పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.191 నుంచి రూ.195, మాంసం రూ.277 నుంచి 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.315 నుంచి రూ.325 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 18, 2026

చిత్తూరు: విధుల్లో చేరిన DFO సుబ్బరాజు

image

ప్రత్యేక శిక్షణ నిమిత్తం దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన జిల్లా అటవీ అధికారి సుబ్బరాజు శనివారం విధుల్లో చేరారు. వైల్డ్ లైఫ్ అంశంపై శిక్షణ పొందేందుకు గతేడాది నవంబరు 9న ఢిల్లీలోని డెహ్రడూన్‌కు వెళ్లిన ఆయన శిక్షణ ముగించుకున్నారు. శనివారం జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టారు.