News September 20, 2024
సిద్దరామయ్య X గవర్నర్: ముడా కేసులో మరో ట్విస్ట్

కర్ణాటక CM సిద్దరామయ్యపై అన్ని డాక్యుమెంట్లు సహా డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్‌ను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆదేశించారు. KUDA చట్టానికి విరుద్ధంగా తన నియోజకవర్గం వరుణ, శ్రీరంగపట్నలో రూ.387 కోట్ల పనులు చేపట్టాలని MUDAను మౌఖికంగా ఆదేశించారని సీఎంపై గవర్నర్ వద్ద మరో పిటిషన్ దాఖలైంది. అధికార దుర్వినియోగంపై CBIతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరడంతో గవర్నర్ స్పందించారు.
Similar News
News December 30, 2025
ఇన్‌కమ్ రిప్లేస్‌మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?

ఇన్‌కమ్ రిప్లేస్‌మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఇంటిపెద్ద మరణిస్తే కుటుంబ అవసరాలకు కొంత మొత్తాన్ని ప్రతినెలా అందిస్తారు. ఇది రెంట్, బిల్లులు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్రతినెలా ఎంత అవసరం, ప్రతి ఏటా 5-10% పెంచి అందించాలనే ఆప్షన్ కూడా ముందే సెలక్ట్ చేసుకోవచ్చు. ఇంటిపెద్ద మరణించినా ఆర్థిక భరోసా ఉంటుంది.
News December 30, 2025
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం

TG: శాసన సభలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు.
News December 30, 2025
2026లో భారత్-పాక్ యుద్ధం.. US CFR జోస్యం

వచ్చే ఏడాదిలో భారత్-పాక్ మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉందని USకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) హెచ్చరించింది. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఈ ఉద్రిక్తతలకు నేపథ్యమని తెలిపింది. ఇరు దేశాలు ఆయుధాల సమీకరణ వేగవంతం చేయడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది.


