News September 20, 2024

స్థానికత విషయంలో నీట్ విద్యార్థులకు ఊరట

image

TG: స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్థానికత వ్యవహారంపై HC తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారి ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టుకు వివరించింది. స్థానికతను నిర్ధారిస్తూ తీర్పులున్నా ఆ విద్యార్థులు HCని ఆశ్రయించారంది.

Similar News

News November 23, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. చిత్తూరులో రూ.219-232 వరకు పలుకుతోంది. మటన్ కేజీ రూ.800-900 మధ్య ఉంది. అటు కోడిగుడ్డు రూ.7వరకు అమ్ముతున్నారు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News November 23, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

⋆ నేడు పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న AP CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్
⋆ నేడు రాప్తాడుకు YCP అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు
⋆ HYDలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్‌మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్‌‌లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. రాంచందర్ రావు

News November 23, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/