News September 20, 2024

నెయ్యిలో నాణ్యత లేదు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News September 20, 2024

విరాట్ తప్పిదం.. నాటౌటైనా పెవిలియన్‌కు!

image

బంగ్లాతో తొలి టెస్టులో భారత్ పట్టు సాధించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు మీదున్న విరాట్ స్వీయ తప్పిదంతో పెవిలియన్ చేరారు. హసన్ వేసిన బంతి ఆయన బ్యాట్‌కు తగులుతూ ప్యాడ్‌ను తాకింది. అంపైర్ LBWగా ఔటిచ్చారు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గిల్‌తో మాట్లాడి కోహ్లీ వెనుదిరిగారు. రీప్లేలో బాల్ ఆయన బ్యాట్‌కు తాకినట్లుగా తేలింది. అది చూసి కెప్టెన్ రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి అసహనం వ్యక్తం చేశారు.

News September 20, 2024

బుమ్రా @ది వరల్డ్ క్లాస్ ప్లేయర్!

image

చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పడగొట్టిన నాలుగు వికెట్లు బంగ్లాను తక్కువ మొత్తానికే ఆలౌట్ చేసేందుకు తోడ్పడ్డాయి. సొంతగడ్డపై బుమ్రా ఇప్పటివరకు 9 టెస్టులు ఆడగా 15.94 సగటు& 32.4 స్ట్రైక్ రేట్‌తో 37 వికెట్లు తీశారు. ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ ఆటగాడని మరోసారి నిరూపించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

News September 20, 2024

నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది: మోదీ

image

విదేశీ గ‌డ్డ‌పై దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్‌లో దేశ‌భ‌క్తి స్ఫూర్తి చ‌చ్చిపోయింద‌ని ఆయన మండిపడ్డారు. ‘పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ల భాష, దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాట‌ల‌ను చూడండి. ఇది ‘తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బ‌న్ న‌క్స‌ల్స్ న‌డుపుతున్న కాంగ్రెస్’ అంటూ ప్ర‌ధాని మండిప‌డ్డారు. మ‌హారాష్ట్ర‌లోని వార్ధ సభలో ఆయ‌న‌ మాట్లాడారు.