News September 20, 2024
జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.
Similar News
News November 10, 2024
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కరెక్టేనా?
AP: ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో అసెంబ్లీ సమావేశాలను YCP బహిష్కరించడం కరెక్ట్ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసమైనా సభకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పలువురు అంటున్నారు. మెజారిటీ సీట్లు ఇచ్చినప్పుడు అధికార పక్షంగా అసెంబ్లీకి వెళ్లిన వారు, ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సభలో విపక్షం ఉండాల్సిందేనని చెబుతున్నారు.
News November 10, 2024
అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ.. గతంలో ఏం జరిగింది?
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని YS జగన్ నిర్ణయించడంతో గతంలో NTR, YSR, CBN కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. NTR 1993లో, 1995లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. 1999-2004 మధ్య YSR కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చివరి రెండేళ్లు సమావేశాలకు వెళ్లలేదు. 2014 తర్వాత జగన్, 2021లో చంద్రబాబు CM అయ్యాకే సభకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు.
News November 10, 2024
డిసెంబర్ 31లోగా చేయకపోతే..
ఫిన్‌టెక్ సంస్థలు కస్టమర్ల ప్రొఫైల్‌ను రూపొందించడం కోసం పాన్ సమాచారాన్ని వాడుతుండటంతో ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకు డిసెంబర్ 31 వరకు గడువునిచ్చింది. లింక్ చేయని పక్షంలో పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.