News September 20, 2024
నెవర్ బిఫోర్ స్థాయికి దేశీయ స్టాక్ మార్కెట్లు

దలాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలేసింది. గ్లోబల్ మార్కెట్స్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వద్ద, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.
Similar News
News March 13, 2025
గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.
News March 13, 2025
నటి ఇళ్లలో ED దాడులు: బంగారం సీజ్!

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బెంగళూరులోని 8 లొకేషన్లలో ED దాడులు చేపట్టింది. కోరమంగల సహా నటి రన్యారావుకు చెందిన 2 ఇళ్లు, కేసులో సహ నిందితుడు తరుణ్ ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ స్థాయిలో బంగారం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో తన కుమార్తెకు సాయం చేయాలని ఆమె తండ్రి, DGP రామచంద్రారావు కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.
News March 13, 2025
మా వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: సీఎం

AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.