News September 20, 2024

ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కనాలి: సీఎం చంద్రబాబు

image

AP: చదువుకున్న యువత పిల్లల్ని కనడంపై ఆసక్తి కనబర్చడం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కంటేనే జనాభా సమతుల్యత ఉంటుంది. APని గాడిలో పెడతానని నన్ను గెలిపించారు. మన GOVT కొనసాగి ఉంటే ఎంత అభివృద్ధి చెందేదో ఆలోచించండి? ఇంకో వ్యక్తి వచ్చి ఏదో చేస్తానంటే ప్రజలు మోసపోతున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది’ అని అన్నారు.

Similar News

News September 20, 2024

రోదసిలో 59వ బర్త్‌డే చేసుకున్న సునీతా విలియమ్స్

image

భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ISSలో తన 59వ పుట్టినరోజు జరుపుకున్నారు. రోదసిలో ఇది ఆమెకు రెండో బర్త్‌డే కావడం విశేషం. బోయింగ్ స్టార్‌లైనర్‌ లోపం కారణంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సంగతి తెలిసిందే. 2006, 2012లో రోదసిలోకి వెళ్లిన ఆమెకు ఇది మూడో పర్యటన. సునీత క్షేమంగా భూమికి తిరిగిరావాలని ఆమె అభిమానులు నెట్టింట విష్ చేస్తున్నారు.

News September 20, 2024

వెట్టయాన్‌లో రజనీ పాత్ర ఇదే!

image

వెట్టయాన్‌ ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీలో ఆయన పాత్ర ఏంటన్నది మూవీ టీమ్ వెల్లడించింది. ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. ఆయన పని విధానం నచ్చని బాస్‌గా అమితాబ్ నటించారు. బిగ్ బీ‌కి ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. జైభీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రానా, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.

News September 20, 2024

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం

image

TG: హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకూ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.