News September 20, 2024

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా: సీఎం రేవంత్

image

TG: దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

BREAKING: కొత్త రేషన్‌కార్డులపై గుడ్‌న్యూస్

image

TG: కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జనవరి నుంచి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే ఈ ఖరీఫ్ నుంచే సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తామని చెప్పారు.

News September 20, 2024

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాకు ముప్పు?

image

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. చెన్నై టెస్టులో అరగంట ఎక్కువ కేటాయించినప్పటికీ బంగ్లా కేవలం 80 ఓవర్లు మాత్రమే వేసింది. ఐసీసీ నియమావళి ప్రకారం.. రౌండ్ స్టేజీలో ఒక్కో పెనాల్టీ ఓవర్‌కు ఒక పాయింట్ తగ్గిస్తారు. ఈ మ్యాచ్ అనంతరం అది జరిగితే బంగ్లా టెస్టు ఛాంపియన్‌షిప్ ముప్పులో పడినట్లే. గత నెలలోనే ఆ జట్టు 3 పాయింట్లను కోల్పోవడంతో పాటు 15శాతం మ్యాచ్ ఫీజు కోతను ఎదుర్కొంది.

News September 20, 2024

రోదసిలో 59వ బర్త్‌డే చేసుకున్న సునీతా విలియమ్స్

image

భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ISSలో తన 59వ పుట్టినరోజు జరుపుకున్నారు. రోదసిలో ఇది ఆమెకు రెండో బర్త్‌డే కావడం విశేషం. బోయింగ్ స్టార్‌లైనర్‌ లోపం కారణంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సంగతి తెలిసిందే. 2006, 2012లో రోదసిలోకి వెళ్లిన ఆమెకు ఇది మూడో పర్యటన. సునీత క్షేమంగా భూమికి తిరిగిరావాలని ఆమె అభిమానులు నెట్టింట విష్ చేస్తున్నారు.