News September 20, 2024

తెలుగువారి మదిలో ANR చిరకాలం ఉంటారు: చిరంజీవి

image

నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు నివాళులర్పించారు. ‘ANR భారత సినిమాలో దిగ్గజం. వారు నటించిన సినిమాలు ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోతాయి. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అసామాన్యం. నాగేశ్వరరావుగారితో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించే అదృష్టం నాకు దక్కింది. వారితో నాకున్న ఎన్నో అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోను’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 13, 2026

షాక్స్‌గామ్‌పై పాక్-చైనా ఒప్పందం చట్టవిరుద్ధం: ఆర్మీ చీఫ్

image

షాక్స్‌గామ్ లోయలో చైనా చేపడుతున్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్-చైనా మధ్య 1963 నాటి ఒప్పందం చట్టవిరుద్ధం. CPEC 2.0పై ఆ దేశాల సంయుక్త ప్రకటనను మేము అంగీకరించం. అక్కడ ఎటువంటి కార్యకలాపాలకు భారత్ అంగీకరించదు. దీనిపై MEA ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది’ అని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. కాగా కారకోరం శ్రేణికి ఉత్తరాన ఈ లోయ ఉంది.

News January 13, 2026

ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

☛ఒక గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్ వేసి అందులో నగలు నాననివ్వాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో తోమి శుభ్రం చేస్తే మునుపటి రూపు సంతరించుకుంటాయి.
☛ డిటర్జెంట్ పౌడర్, ఒక చెక్క నిమ్మరసం వేడి నీటిలో కలిపి ఆభరణాలను వేసి 5నిమిషాలు ఉంచాలి.
☛బంగారు గాజులను నీటిలో నానబెట్టి రెండు చెంచాల శనగపిండిలో తగినంత వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించాలి. తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి.

News January 13, 2026

10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ బంద్

image

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన యాడ్స్ ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు సూచించారు. కాగా 10 ని. నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు. దీంతో సంస్థలకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.