News September 20, 2024
MBNR: గుండెపోటుతో క్రీడాకారుడి మృతి

నవాబ్‌పెట మండలం ఎన్మనగండ్ల గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఆయాజ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడని ఆయన మిత్రులు తెలిపారు. ఆయన లేకపోవడం జాతీయ వాలీబాల్ జట్టుకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 17, 2026
బతుకమ్మ చీరలు చేలల్లో కట్టడానికే పనికొచ్చినయ్: CM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు పట్టుకునేందుకు పనికి రాలేదని చేన్లలో పందులు రాకుండా అడ్డుకునేందుకు పనికి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఆగం చేశారన్నారు.
News January 17, 2026
MBNR: చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవు: కె.ప్రవీణ

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ కాలేజీలో కొనసాగుతున్న బీ-ఫార్మసీ V &VII సెమ్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికాణి డాక్టర్ కే.ప్రవీణ పరిశీలించారు. చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవని, అదేవిధంగా పరీక్ష హాలులో ఏమైనా సమస్యలుంటే చీప్ సూపరింటెండెంట్ దృష్టికి తేవాలని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కాంత్ పాల్గొన్నారు.
News January 17, 2026
దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణా నుండే రావాలి- CM

దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి గ్రామంలో త్రిబుల్ ఐటీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.


