News September 20, 2024

బాంబే హైకోర్టులో కేంద్రానికి చుక్కెదురు.. ఐటీ రూల్స్ సవరణలు కొట్టివేత

image

IT రూల్స్‌కి కేంద్రం చేసిన స‌వ‌ర‌ణ‌ల‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి వ‌చ్చే న‌కిలీ, త‌ప్పుడు వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొనేలా కేంద్రం IT చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసింది. అయితే ఇది ఆర్టిక‌ల్ 14 (స‌మాన‌త్వం), 19(స్వేచ్ఛ‌) హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని జస్టిస్ అతుల్ చందూర్కర్ బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.

Similar News

News September 21, 2024

మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి

image

AP: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) మరణించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రేపు విజయవాడలోని మొగల్రాజపురంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1983లో టీడీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి జయప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అత్యంత సన్నిహితులు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

News September 21, 2024

కొత్త స్టడి: మందు బాటిల్‌పై కేలరీల లేబుల్‌‌తో సేవించే మోతాదు తగ్గిస్తారు!

image

బాటిల్‌పై కేల‌రీల‌ లేబుల్ ఉంచితే మందుబాబులు మ‌ద్యం సేవించే మోతాదును త‌గ్గించుకొనే అవ‌కాశం ఉంద‌ని ఇంగ్లండ్‌లో జ‌రిపిన ఓ అధ్య‌య‌నం తేల్చింది. 4,684 మంది పెద్దలపై UCL పరిశోధకులు అధ్య‌య‌నం జ‌రిపారు. దీని ప్ర‌కారం బాటిళ్ల‌పై కేలరీల లేబుల్‌లను జోడిస్తే, సగం కంటే ఎక్కువ మంది మద్యం ప్రియులు తమ మద్యపాన అలవాట్లను మార్చుకుంటారని కనుగొన్నారు. సేవించే మోతాదు ఎంతున్నా తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారన్నారు.

News September 20, 2024

దిగ్గజాల సరసన యశస్వీ జైస్వాల్

image

భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించారు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ 10 టెస్టుల్లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్క్ టేలర్(1,088)ను అధిగమించారు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్(1,446) అగ్ర స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎవర్టన్ వీక్స్(1,125), జార్జ్ హెడ్లీ(1,102) కొనసాగుతున్నారు.