News September 20, 2024

త్రోబాల్‌ ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లు ఎంపిక

image

రాష్ట్ర స్థాయి త్రో బాల్‌ పోటీలకు ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా త్రో బాల్‌ సంఘం కార్యదర్శి సులోచన తెలిపారు. పురుషుల జట్టుకు రవివర్మ, ప్రమోద్, చరణ్‌తేజ్, చరణ్‌సాయి, యశ్వంత్, రాము, సాయిసంతోష్, రాజ్‌దీప్, జ్యోతివర్మ, అక్షయ్, సూర్య, వెంకటేష్, భాస్కర్, జోసఫ్, అఖిల్, మహిళల జట్టుకు శ్రావణి, జోషిత, సాయిదుర్గ, దక్షిణి, నీరజ, దుర్గ, రితిక ఎంపికైనట్లు చెప్పారు.

Similar News

News February 7, 2026

మచిలీపట్నంలో 38 మంది అధికారులపై చర్యలు

image

మచిలీపట్నం నగర పాలక సంస్థలో పని చేస్తున్న 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ACB అధికారులు చేపట్టిన తనిఖీల్లో బిల్లులు ఇవ్వకుండా కొత్త నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్నుల విధింపులో అవకతవకలు చేశారని గుర్తించారు. దీనికి బాధ్యులైన 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. వీరిలో అప్పటి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఉన్నారు.

News February 6, 2026

బందరు పోర్టుకు రూ.573.77 కోట్ల రహదారి ప్రాజెక్టు..!

image

బందరు పోర్టు అభివృద్ధికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్లతో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. NH-65, NH-216 జంక్షన్‌లను నేరుగా పోర్టుతో అనుసంధానిస్తూ 6 లైన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక భారీ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.

News February 6, 2026

కృష్ణా: టిడిపి జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నేడే

image

కృష్ణా జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిమ్మకూరు వేదికగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి గురుమూర్తి కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు, వివిధ హోదాల్లో నియమితులైన కార్యవర్గ సభ్యులు కూడా అదే సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.