News September 20, 2024

కల్తీ నెయ్యి ఘటన.. దేవాదాయశాఖ అప్రమత్తం

image

AP: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 13, 2024

క్రికెట్‌లోకి యశస్వీ జైస్వాల్ సోదరుడు రీఎంట్రీ

image

టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్ అన్న తేజస్వీ జైస్వాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. త్రిపుర తరఫున బరోడాతో జరిగిన మ్యాచ్‌లో తేజస్వీ (87) అర్ధ సెంచరీ సాధించారు. కాగా తొలుత యశస్వీ, తేజస్వీ ఇద్దరూ క్రికెట్ ఆడేవారు. కానీ యశస్వీ కోసం తేజస్వీ క్రికెట్ వదిలి ఢిల్లీలోని ఓ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో యశస్వీ నిలదొక్కుకున్నాక తేజస్వీ మళ్లీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.

News November 13, 2024

ఆన్‌లైన్ డెలివరీ సంస్థలకు కీలక ఆదేశాలు

image

ఫుడ్ ఐటమ్స్ డెలివరీ విషయంలో ఈకామర్స్ సంస్థలకు FSSAI కీలక ఆదేశాలిచ్చింది. డెలివరీ సమయానికి ఫుడ్ ఐటమ్స్ నిల్వకాలం మరో 30% ఉండేలా చూసుకోవాలని చెప్పింది. లేదా ఎక్స్‌పైరీ డేట్ కనీసం మరో 45రోజులుండాలని పేర్కొంది. లేబుల్స్‌పై లేని సమాచారాన్ని ప్రకటనల్లో చూపించవద్దని పేర్కొంది. ఆహార, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చెయ్యాలని, తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని చెప్పింది.

News November 13, 2024

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: సీఎం రేవంత్

image

జనాభాను నియంత్రించిన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని CM రేవంత్ అన్నారు. ‘దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశానికి ఒక రూపాయి పోతే కేంద్రం నుంచి 40 పైసలు మాత్రమే వస్తుంది. బిహార్ ఒక రూపాయి ఇస్తే రూ.7.06 వస్తుంది. 2025 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు 800 ఎంపీ సీట్లు వస్తాయి. సౌత్‌లో 123కి తగ్గిపోతాయి. దీంతో కేంద్రంలో సౌత్ పాత్ర తగ్గిపోతుంది’ అని IE ప్రోగ్రాంలో చెప్పారు.