News September 21, 2024

ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తాం: భట్టి

image

శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం (SLBC) ప్రాజెక్టును శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అనంతరం అధికారులతో భట్టి సమీక్షించారు. ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. అటు నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వితే 14 కోట్లు నిధులు అవసరమవుతాయని, 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉందని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 11, 2024

పాల్వంచ: సర్వేను పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఎన్యూమరేటర్లను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో పర్యటించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించి వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే సూపర్‌వైజర్లకు తెలపాలని అన్నారు.

News November 10, 2024

గడ్డి మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

గడ్డి మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ధనలక్ష్మి తన ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2024

ఖాళీ స్థలాల యజమానులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, చెత్త వేయడం వల్ల దోమలు, కోతులతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఖాళీ ప్లాట్ లను యజమానులు శుభ్రం చేయకుంటే వెంటనే ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. కూడలి ఉన్న ప్రదేశంలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.