News September 21, 2024
ప్రతి అంశంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్
BJPని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ అవినీతి వల్లే శివాజీ విగ్రహం కూలిందని, గురుగ్రామ్లో బైకర్ మృతికి కారణమైన కారుపై BJP స్టిక్కర్ ఉండడం వల్లే ఆ డ్రైవర్కు ఒక్కరోజులోనే బెయిల్ వచ్చిందని విమర్శించింది. పుణేలో పేవ్మెంట్కు గుంతపడి ట్రక్కు ఇరుక్కోవడంతో కొత్త ఎక్స్ప్రెస్ వే ద్వారా సెకెన్లలో పాతాళానికి చేరుకోవచ్చంటూ BJPని టార్గెట్ చేస్తోంది.
Similar News
News November 11, 2024
అత్యంత విలువైన కంపెనీకి CEO.. కానీ వాచ్ పెట్టుకోరు!
NVIDIA సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అలాంటి సంస్థకు CEOగా ఉన్న జెన్సెన్ హువాంగ్ వాచ్ పెట్టుకోరు. అందుకు కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘మీరు మా కంపెనీ ఉద్యోగుల్ని అడిగి చూడండి. మాకు దీర్ఘకాలం ప్లాన్స్ ఉండవు. ప్రస్తుతం మీద దృష్టి పెట్టడమే మా అజెండా. భవిష్యత్తు కాదు.. ముందు ఈ క్షణంపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతోనే వాచ్ ధరించను’ అని వివరించారు.
News November 11, 2024
ట్రంప్ ఎన్నికతో భారత్కు ఆందోళన లేదు: జైశంకర్
US ఎన్నికల్లో ట్రంప్ గెలిచారని ఆందోళన చెందే దేశాల్లో భారత్ లేదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ‘చాలా దేశాలు ట్రంప్ గెలుపుపై ఆందోళన చెందాయి. భారత్కు అలాంటి టెన్షన్ లేదు. ఆయన గెలవగానే కాల్ చేసిన తొలి ముగ్గురిలో PM మోదీ కూడా ఉన్నారు. వారిద్దరికీ మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఇతర దేశాలతో బంధం బలోపేతం చేసుకోవడంలో ప్రధాని చేసిన కృషి భారత్కు ఉపకరించింది’ అని పేర్కొన్నారు.
News November 11, 2024
పేజర్లతో దాడిని అంగీకరించిన నెతన్యాహు!
లెబనాన్లో పేజర్ల ద్వారా దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్లో జరిగిన ఈ పేలుళ్లలో దాదాపు 40 మంది హెజ్బొల్లా సభ్యులు మరణించారు. ఈ ఘటనపై యునైటెడ్ నేషన్స్ లేబర్ ఏజెన్సీకి లెబనాన్ ఫిర్యాదు చేసింది. మానవత్వంపై ఘోరమైన దాడిగా పేర్కొంది.