News September 21, 2024

భద్రతామండలిలో చేరేందుకు భారత్‌కు ఉన్న అడ్డంకులివే

image

ఐరాస భద్రతామండలి(UNSC)లో US, ఫ్రాన్స్, రష్యా, UK, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నా సభ్యత్వం మాత్రం దక్కడం లేదు. వీటో అధికారంతో చైనా మోకాలడ్డుతుండటం, ‘వీటో పవర్ లేకుండానే సభ్యత్వం’ అనే ప్రతిపాదనకు భారత్ నిరాకరణ, తాము చెప్పిన మాట భారత్ వినదేమోనన్న పశ్చిమ దేశాల అనుమానాలు, పొరుగు దేశాలపై భారత్‌కు నియంత్రణ లేకపోవడం కారణాలుగా ప్రపంచ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Similar News

News September 21, 2024

ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్

image

AP: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

News September 21, 2024

రాష్ట్రంలో పరువు హత్య

image

AP: అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురిని పేరెంట్స్ హతమార్చిన ఘటన నెల్లూరు(D) పద్మనాభునిసత్రంలో జరిగింది. రమణయ్య, దేవసేనమ్మల చిన్నకూతురు శ్రావణి(24) భర్తతో విడిపోయింది. ఇటీవల రబ్బానీ బాషాను పెళ్లిచేసుకోగా తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయింది. దీంతో ఇంటిపక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు.

News September 21, 2024

HYDలో ఇళ్ల అమ్మకాలు ఢమాల్!

image

HYDలో జూలై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల అమ్మకాల్లో సుమారు 42% క్షీణత నమోదవుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో 20,658 యూనిట్ల విక్రయం జరగ్గా ఈసారి 12,082 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, నవీ ముంబై మినహా 9 ప్రధాన పట్టణాల్లో 18% తగ్గుముఖం పట్టినట్లు వివరించింది.