News September 21, 2024

అక్కినేని ఫ్యామిలీ PHOTO

image

ANR శతజయంతి వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగేశ్వరరావు ఇద్దరు కొడుకులు వెంకట్, నాగార్జున, ముగ్గురు కూతుళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఒకే వేదికపై కనిపించారు. హీరోలు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్‌తో పాటు నటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోను అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Similar News

News January 13, 2026

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ (<>BARC)<<>> 12 నర్సు పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్, డిప్లొమా(నర్సింగ్ &మిడ్‌వైఫరీ/ BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. జీతం నెలకు రూ.55వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in

News January 13, 2026

‘జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

image

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ <<18824314>>ఆరోపణల్లో<<>> నిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్‌ ఆంఖోలర్‌ అన్నారు. ‘ఆమెకు జూనియర్ బాక్సర్‌తో వివాహేతర సంబంధం ఉండేది. ఫ్యామిలీ సర్దిచెప్పినా మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకు నా దగ్గర వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్‌లు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుంది. అందుకే విడాకులు తీసుకుంది’ అని IANS ఇంటర్వ్యూలో చెప్పారు.

News January 13, 2026

రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తామంటే ఊరుకోం: పొంగులేటి

image

TG: జిల్లాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. అశాస్త్రీయంగా చేసిన జిల్లాలను మళ్లీ శాస్త్రీయంగా మారుస్తామని సీఎం రేవంత్ చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని <<18838995>>అగ్నిగుండంగా<<>> చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100 పర్సెంట్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.