News September 21, 2024

OCT 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్

image

AP: మహాలయ అమావాస్య దృష్ట్యా అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఆర్‌జేయూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా 3న కూడా సెలవు ఇస్తే ధార్మిక క్రతువులకు వీలుంటుందని ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు ప్రకటించింది. అటు ఇటీవల భారీ వర్షాలతో సెలవులు ఇచ్చినందువల్ల ఈ దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Similar News

News September 21, 2024

విమర్శలను సహించడమే ప్రజాస్వామ్యానికి పరీక్ష: గడ్కరీ

image

వ్యతిరేక అభిప్రాయాలను సహిస్తూ, అవి పాలకుడిలో అంతర్మథనానికి దారితీయడమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్షని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రచయితలు, మేధావులు నిర్భయంగా అభిప్రాయాలు చెప్పాలన్నారు. ‘దేశంలో భిన్నాభిప్రాయాలపై ఇబ్బంది లేదు. అభిప్రాయాలు లేకపోవడమే అసలు సమస్య. మేం రైటిస్టులమో లెఫ్టిస్టులమో కాదు. మేం ఆపర్చునిస్టులం. అంటరానితనం, ఆధిపత్యం, చిన్నతనం ఉన్నన్నాళ్లూ జాతి నిర్మాణం జరగద’ని అన్నారు.

News September 21, 2024

మరో 2 గంటల్లో వర్షం..

image

TG: హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. యాప్రాల్, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో 2 గంటల్లో సికింద్రాబాద్, బేగంపేట, కూకట్‌పల్లి సహా సెంట్రల్, ఈస్ట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరి మీ ఏరియాలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.

News September 21, 2024

లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.