News September 21, 2024
కడప: తిరుపతి సోలాపూర్ రైలు గడుపు పెంపు

కడప రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే సోలాపూర్-తిరుపతి- సోలాపూర్ (01437/01438) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు గడువును, డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. సోలాపూర్-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించారన్నారు. కడప ఎర్రగుంట్ల స్టాపింగ్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
Similar News
News January 20, 2026
కడప: గుండెపోటుతోనే విజయకుమారి మృతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్

సర్వేల పేరుతో వేధించడంతోనే కడపలో సచివాలయ ఉద్యోగిని జి.విజయకుమారి చనిపోయిందని వైసీపీ ట్వీట్ చేసింది. దీనిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘విజయకుమారి దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలోని సచివాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈనెల 18న గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. ప్రభుత్వ వేధింపులతో అని తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అని ట్వీట్ చేసింది.
News January 19, 2026
కడప: చంద్రప్రభ వాహనంపై దర్శనం

దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీలక్ష్మి సమేత వేంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
News January 19, 2026
కడప పోలీసులకు 76 ఫిర్యాదులు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన పోలీస్ అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. మొత్తంగా 76 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సకాలంలో విచారణ జరిపి, పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.


