News September 21, 2024
కొత్తదారులు వెతకడమే ‘బైడెన్, మోదీ మీటింగ్’ ఎజెండా
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమే క్వాడ్ అని PM మోదీ అన్నారు. అమెరికాకు బయల్దేరే ముందు ఆయన మాట్లాడారు. ‘క్వాడ్ సమ్మిట్‌లో ప్రెసిడెంట్ బైడెన్, PM అల్బనీస్, PM కిషిదాను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం IND-US అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్‌తో సమావేశంలో అన్వేషిస్తాం’ అని అన్నారు.
Similar News
News December 30, 2024
vitamin D దొరికే ఫుడ్స్ ఇవే
ఒంటికి మేలు చేసే <<15021724>>vitamin D<<>> ఆహారంలో కన్నా సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం పడే ఎండలో వాకింగ్, ఎక్సర్సైజులు చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇక సాల్మన్, సార్డైన్స్, హెర్రింగ్, మాకెరెల్ వంటి చేప నూనెలో బాగా దొరుకుతుంది. రెడ్ మీట్, లివర్, కోడిగుడ్డు సొన, కొన్ని తృణ ధాన్యాల్లోనూ లభిస్తుంది. వైద్యులు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు vitamin D సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
News December 30, 2024
సిఫారసు లేఖల వ్యవహారం: రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఇకపై వారి సిఫారసు లేఖలను అనుమతిస్తామని తెలిపారు. ప్రతివారం(సోమవారం నుంచి గురువారం) ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలను అంగీకరిస్తామని పేర్కొన్నారు.
News December 30, 2024
‘స్పేడెక్స్ మిషన్’ అంటే?
శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో ఇవాళ రాత్రి 10 గంటలకు <<15018046>>PSLV-C60<<>> ద్వారా ‘స్పేడెక్స్ మిషన్’ను నింగిలోకి పంపనుంది. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ప్రయోగం. ఉపగ్రహాల్ని డాకింగ్, అన్ డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేయడం, ప్రదర్శించడం దీని లక్ష్యాలు. అంతరిక్షంలో రెండు వ్యోమనౌకలను పక్కపక్కన చేర్చి లింక్ చేయడాన్ని స్పేస్ డాకింగ్ అని, లింకై ఉన్న వాటిని వేరు చేయడాన్ని అన్ డాకింగ్ అని అంటారు.