News September 21, 2024
బెజ్జంకి: కుటుంబ కలహాలో తల్లీ, కూతురు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన కూతురితో సహా సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. జనగాం జిల్లాకు చెందిన రాజు జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి బెజ్జంకి మండలానికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. రాజు మద్యానికి బానిసై తరుచుగా భార్య శారద, పిల్లలతో గొడవ పడేవాడు. గురువారం అర్ధరాత్రి సైతం గొడవ పడగా మనస్తాపానికి గురై శారద కుమార్తెతో సాహ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News January 13, 2026
మెదక్: కౌన్సిలర్ అభ్యర్థుల్లో రిజర్వేషన్ టెన్షన్

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.
News January 13, 2026
మెదక్ జిల్లాలో మహిళలదే హవా !

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 45,168 మంది ఉండగా, పురుష ఓటర్లు 42,015 మంది ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 19,406, తూప్రాన్ 10,302, నర్సాపూర్ 8,656, రామాయంపేట 6,804 మహిళా ఓటర్లు ఉండగా, మెదక్ 17,548, తూప్రాన్ 9,957, నర్సాపూర్ 8,219, రామాయంపేట 6,291 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్‌లో ఒక్కొక్క ఓటరు ఇతరులు ఉన్నారు.
News January 13, 2026
MDK: ఆపరేషన్ స్మైల్.. అమ్మనాన్న మీ దగ్గరికి వచ్చేశా!

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి జరుగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల్లో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.


