News September 21, 2024

ప్రకాశం: సీఎం చంద్రబాబుకు 53 వినతి పత్రాలు

image

నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం’జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు ప్రజల నుంచి 53 వినతి పత్రాలు స్వీకరించారని సంబంధిత అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. రెవిన్యూ సమస్యలపై 11, పెన్షన్ మంజూరుకు 8, వివిధ ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యసమస్యలపై 4, రోడ్లు అభివృద్ధి చేయాలని 12, ఇళ్ల మంజూరుకు 4, ఉద్యోగాల కోసం 11, విద్యుత్ సమస్యలపై 2 వినతులు వచ్చాయన్నారు.

Similar News

News November 11, 2025

ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

image

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉండవల్లికి బయలుదేరారు.

News November 11, 2025

త్వరలో కనిగిరి కనకపట్నం అవుతుంది: సీఎం చంద్రబాబు

image

1996లో తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి కనిగిరి ప్రజలకు నీరు అందిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి కాకుండా గోదావరి నీళ్లు కూడా జిల్లాకు తీసుకొస్తానని అన్నారు. ఇది జరిగితే కనిగిరి కనకపట్నం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పామూరుకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు.

News November 11, 2025

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లికి చేరుకున్న సీఎం

image

ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్ద చెర్లోపల్లి మండలం ఇర్లపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇన్‌ఛార్జులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరకున్నారు.