News September 21, 2024

విమర్శలను సహించడమే ప్రజాస్వామ్యానికి పరీక్ష: గడ్కరీ

image

వ్యతిరేక అభిప్రాయాలను సహిస్తూ, అవి పాలకుడిలో అంతర్మథనానికి దారితీయడమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్షని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రచయితలు, మేధావులు నిర్భయంగా అభిప్రాయాలు చెప్పాలన్నారు. ‘దేశంలో భిన్నాభిప్రాయాలపై ఇబ్బంది లేదు. అభిప్రాయాలు లేకపోవడమే అసలు సమస్య. మేం రైటిస్టులమో లెఫ్టిస్టులమో కాదు. మేం ఆపర్చునిస్టులం. అంటరానితనం, ఆధిపత్యం, చిన్నతనం ఉన్నన్నాళ్లూ జాతి నిర్మాణం జరగద’ని అన్నారు.

Similar News

News September 21, 2024

ఈ 7 అలవాట్లతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు

image

కొన్ని అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవి 1.గోర్లు కొరకడం. దీని వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. 2.తినేటప్పుడు TV/ఫోన్ చూడటం. 3.ఎక్కువగా హెడ్‌ఫోన్స్ వాడటం. 4.నిద్రపోయే ముందు ఫోన్ చూడటం. 5.బెడ్‌పై పడుకొని తినడం. ఇలా తింటే జీర్ణక్రియ సరిగా జరగదు. 6.పళ్లు కొరకడం. దీని వల్ల సెన్సిటివిటీ, దవడ నొప్పి వస్తుంది. 7.పికీ ఈటింగ్‌. దీని వల్ల పోషకాలున్న ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

News September 21, 2024

ప్రకాశ్ రాజ్‌కు మంచు విష్ణు కౌంటర్!

image

లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ <<14151603>>సీఎం పవన్ కళ్యాణ్‌‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు <<>>చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రకాశ్ రాజ్ గారూ. తిరుమల లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు. నాలాంటి కోట్లాదిమంది హిందువులకు ఓ నమ్మకం. దర్యాప్తు జరగాలంటూ పవన్ కళ్యాణ్‌ కరెక్ట్‌గా మాట్లాడారు. మతకల్లోలాల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో’ అని సూచించారు.

News September 21, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.820 పెరిగి రూ.75,930కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.750 పెరిగి రూ.69,600 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.98,000కి చేరింది.