News September 21, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పటికే రెండు బోట్లను తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను బయటికి తీశారు. వీటిని పున్నమి ఘాట్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా, మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Similar News

News August 31, 2025

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా?

image

జీమెయిల్ అకౌంట్ యూజర్లకు గూగుల్ కీలక సూచన చేసింది. హ్యాకింగ్ అటాక్స్ నేపథ్యంలో వెంటనే పాస్‌వర్డ్స్ ఛేంజ్ చేసుకోవాలంది. థర్డ్ పార్టీ సేల్స్‌ఫోర్స్ సిస్టమ్ డేటాను తస్కరించడంతో 250కోట్ల మంది అకౌంట్స్ ప్రమాదంలో పడ్డాయని ఇటీవల గూగుల్ వెల్లడించింది. అయితే కస్టమర్ డేటాకు ప్రమాదం లేదని, కంపెనీ సేల్స్‌ఫోర్స్ సిస్టమ్‌కు ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా పాస్‌వర్డ్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

News August 31, 2025

‘స్థానిక’ ఎన్నికలు.. EC కీలక ఉత్తర్వులు

image

TG: సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం (EC) కార్యాచరణ ప్రారంభించింది. ‘MPTC, ZPTC స్థానాల్లో SEP 6న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురించాలి. 6-8 వరకు వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించి 9న వాటిని పరిష్కరించాలి. 10న తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి’ అని కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

News August 31, 2025

ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే!

image

AP: సాధారణంగా మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలను ఈసారి FEBలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సిద్ధమైంది. CBSEతో పాటు ఎగ్జామ్స్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు తగినట్లు షెడ్యూల్‌లో మార్పులు చేసింది. తొలుత సైన్స్ స్టూడెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు స్టార్ట్ అవుతాయి. తర్వాత లాంగ్వేజ్, చివర్లో ఆర్ట్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్స్ నిర్వహణపై క్లారిటీ రావాల్సి ఉంది.