News September 21, 2024

జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్!

image

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్‌పై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టును కోరనున్నారు. మరోవైపు జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు.

Similar News

News September 21, 2024

ఇగ్నో అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్‌కు సంబంధించి అన్ని ఆన్‌లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌ల కోసం అడ్మిషన్ల గడువును పొడిగించింది. తాజాగా Sep 30, 2024 వ‌ర‌కు గ‌డువు పెంచింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్స్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు అడ్మిషన్ల గడువు పెంచారు.

News September 21, 2024

బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి

image

AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నిరూపించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ వ్యవహారంపై తిరుమలలో చంద్రబాబు, లోకేశ్‌కు ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపాం. కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చింది’ అని అంబటి ఆరోపించారు.

News September 21, 2024

విదేశీ పర్యటనకు బయల్దేరిన డిప్యూటీ సీఎం భట్టి

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 4 వరకు ఆయన అమెరికా, జపాన్‌లో పర్యటిస్తారు. ఆయనతోపాటు అధికారుల బృందం కూడా వెళ్లింది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్‌పో, ప్రముఖ కంపెనీల సందర్శన, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. 28 వరకు అమెరికాలో, 29 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో పర్యటిస్తారు.