News September 21, 2024

రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

image

AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

Similar News

News November 6, 2025

ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

image

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్‌కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.

News November 6, 2025

దురుద్దేశంతోనే నాపై స్టాలిన్ ఆరోపణలు: విజయ్

image

కరూర్(TN) తొక్కిసలాటపై CM స్టాలిన్ అసెంబ్లీలో తనపై ద్వేషంతోనే ఆరోపణలు చేశారని TVK చీఫ్ విజయ్ విమర్శించారు. బాధితుల్ని ఆదుకున్నా రాజకీయ, ప్రభుత్వ, మీడియా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దీంతోనే నిష్పాక్షిక విచారణ జరగదని సుప్రీం గుర్తించిందని చెప్పారు. ఎన్నికల్లో DMK, TVK మధ్యే పోటీ అని స్పష్టంచేశారు. తొక్కిసలాట తర్వాత తొలిసారి భేటీ అయిన TVK కౌన్సిల్ CM అభ్యర్థిగా విజయ్‌ను డిక్లేర్ చేసింది.

News November 6, 2025

అమ్మకానికి RCB.. మార్చి 31 నాటికి కొత్త ఓనర్!

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను <<18032689>>అమ్మకానికి<<>> ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని, 2026 MAR 31 నాటికి కొత్త ఓనర్ చేతుల్లోకి ఫ్రాంచైజీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో పేరెంట్ కంపెనీ Diageo (United Spirits Limited) ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే వచ్చే IPL సీజన్‌లో కొత్త కంపెనీ ఆధ్వర్యంలో RCB ఆడే ఛాన్స్ ఉంది.