News September 21, 2024
ప్రకాశం జిల్లా వాసికి కష్టం.. సాయం చేసిన లోకేశ్

ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7లక్షలు అందించారు. ఈ నేపథ్యంలో నాగరాజు కుటుంబ సభ్యులు ఉండవల్లి ప్రజాదర్బార్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 19, 2026
ప్రశాంతంగా పరీక్షలు రాయండి: మంత్రి స్వామి

ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో మంత్రి స్వామి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురుకులాల విద్యార్థులు 161 మంది జేఈఈ మెయిన్స్‌కి అర్హత సాధించినట్లు తెలిపారు.
News February 19, 2026
24న ఒంగోలులో సైక్లింగ్ పోటీలు

ఒంగోలు మిని స్టేడియంలో ఈనెల 24వ తేదీ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారని జిల్లా క్రీడాధికారి సంస్థ అధికారిణి జి.రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారి నుంచి మాస్టర్స్ వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.
News February 19, 2026
పొదిలి: ఒక్కో ప్లేట్‌కు రూ.50.. మిమ్మల్నీ అడిగారా?

పొదిలిలో విద్యుత్ సర్వీసు నంబర్ ప్లేట్లు బిగించి ప్రతి ఒక్కరి వద్ద రూ.50 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పాత ప్లేట్ ఉన్నప్పటికీ.. తప్పనిసరిగా కొత్త ప్లేట్ పెట్టాలంటూ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా.. తమకు సంబంధం లేదని.. ప్రైవేట్ కాంట్రాక్టర్ వాటిని బిగిస్తున్నారని చెప్పారు.


