News September 21, 2024

ఇంటెల్ కంపెనీని కొంటున్న క్వాల్‌కామ్!

image

ఇంటెల్‌ను టేకోవర్ చేయాలని క్వాల్‌కామ్ భావిస్తోందని తెలిసింది. ఇప్పటికే దాన్ని సంప్రదించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నియంత్రణ సంస్థల ఆమోదం లభించి ఈ డీల్ పూర్తవ్వడానికి చాలా కాలమే పట్టొచ్చని అంచనా. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను ఉత్పత్తి చేసే క్వాల్‌కామ్ ఈ మధ్యే పీసీ ప్రాసెసర్ల రంగంలోకి ఎంటరైంది. ఇక $1.6 బిలియన్ల లాస్‌లో ఉన్న ఇంటెల్ షేర్లు 2024లో 60% క్రాష్ అయ్యాయి.

Similar News

News September 21, 2024

శ్రీలంక‌లో ముగిసిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

image

శ్రీలంక అధ్య‌క్ష ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. 2022 ఆర్థిక సంక్షోభం త‌రువాత తొలిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. పోలింగ్ ముగిసే స‌మ‌యానికి 70% ఓటింగ్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అధ్య‌క్షుడు ర‌ణిల్ విక్ర‌మ సింఘె, విప‌క్ష నేత సంజిత్ ప్రేమ‌దాస‌, అనూర దిస్స‌నాయకే మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. పోలింగ్ పూర్తైన వెంట‌నే కౌంటింగ్ కూడా ప్రారంభ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా ఆర్థిక స‌వాళ్లను ఎదుర్కోవాల్సిందే.

News September 21, 2024

త్వరలోనే 3వేల పోస్టులకు నోటిఫికేషన్

image

తెలంగాణలోని 8 మెడికల్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే 3 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. వీటితో పాటు ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్‌కు 34 సిబ్బంది మంజూరు, కోస్గిలో ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీ మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి చేసేలా రూ.4637 కోట్లు మంజూరు చేసింది.

News September 21, 2024

లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లకు కేరళకు సంబంధం ఏంటి?

image

లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల ఘటనలో కేర‌ళ‌లో పుట్టిన, నార్వే సిటిజ‌న్ రిన్స‌న్ జోస్‌(36) పేరు వినిపించింది. బల్గేరియాకు చెందిన నార్టా గ్లోబల్ కంపెనీకి జోస్ యజమాని. పేజర్‌లను తైవానీస్ సంస్థ గోల్డ్ అపోలో ట్రేడ్‌మార్క్‌తో BAC కన్సల్టింగ్ అనే హంగేరియన్ కంపెనీ తయారు చేసింది. అయితే వాటిని జోస్ సంస్థ ద్వారా కొనుగోలు చేశార‌నే వార్త‌లొచ్చాయి. బ‌ల్గేరియా జాతీయ భ‌ద్ర‌త ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది.