News September 21, 2024

నెయ్యి కల్తీ అయిందా? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

image

☛ స్వచ్ఛమైన నెయ్యి గోల్డ్ కలర్‌లో, మృదువుగా, సువాసనతో, రుచికరంగా ఉంటుంది.
☛ గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. పూర్తిగా కరిగిపోతే అది ప్యూర్ అని, వాటర్‌లో ఏమైనా అవశేషాలు కనిపిస్తే అది కల్తీ అని అర్థం.
☛ ప్యూర్ నెయ్యి వేడి చేస్తే వెంటనే కరిగిపోతుంది. పొగ, కాలిన వాసన ఎక్కువగా రాదు.
☛ ఫ్రిడ్జ్‌లో కొన్ని గంటలపాటు ఉంచితే నెయ్యంతా ఒక్కటిగా గడ్డకడుతుంది. అలా జరగలేదంటే అది ప్యూర్ కాదు.

Similar News

News September 21, 2024

NPA డైరెక్టర్‌గా అమిత్ గార్గ్

image

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన గార్గ్ 2027 అక్టోబర్ 31 వరకు పదవిలో ఉంటారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్‌గా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అలోక్ రంజన్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌ ఐపీఎస్ ఆఫీసర్లు రిత్విక్ రుద్ర, మహేశ్ దీక్షిత్, ప్రవీణ్ కుమార్, అరవింద్ కుమార్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

News September 21, 2024

పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది: జానీ మాస్టర్ భార్య

image

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోండని ఆమె జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచి, బయట పెళ్లి చేసుకోమనేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News September 21, 2024

జనవరిలో బీచ్ ఫెస్టివల్: దుర్గేశ్

image

AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్‌ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్‌ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.