News September 21, 2024

కరీంనగర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్తంభించిన మీసేవా సేవలు

image

పదిరోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మీసేవా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర డేటా సెంటర్లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు.

Similar News

News September 21, 2024

పెద్దపల్లి: ఇద్దరి ఉపాధ్యాయుల సస్పెండ్

image

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇద్దరు కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు సదానందం, అబ్దుల్ ఖాదిరిలపై విచారణ జరిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ఇన్‌ఛార్జి డీఈవో జనార్దన్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.

News September 21, 2024

కొత్తపల్లి: రైల్వే లైన్ పనులకు రూ.137 కోట్లు

image

కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల కోసం ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసింది. అలాగే కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్యలో ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయడం శుభపరిణామం. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ.. ఈ వేగంతో పనులు ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు.

News September 21, 2024

జగిత్యాల: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన మనీశ్(6) జ్వరంతో మృతి చెందాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. మళ్లీ రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. డెంగ్యూగా నిర్ధారణ కావడంతో కుటుంబీకులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందాడు.