News September 21, 2024

ప్రసాదంలో కాదు.. చంద్రబాబులోనే కల్తీ: VSR

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని YCP MP విజయసాయిరెడ్డి అన్నారు. కల్తీ అంతా CM చంద్రబాబు బుర్ర, మనసులోనే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘బాబు జీవితంలో ఆరోపణలు తప్ప నిరూపణలు ఉండవు. కలియుగంలో ఆయన చేసిన పాపాలు ఎవరూ చేసి ఉండరు. నీ ప్రవర్తనతో కంసుడు, కీచకుడు సిగ్గు పడేలా చేశావు. నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు ప్రజల దురదృష్టం. ఆ దేవదేవుడు ఎప్పటికీ నిన్ను క్షమించడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News December 30, 2024

ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి

image

APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.

News December 30, 2024

అన్ని కార్య‌క్ర‌మాల్లో ప్ర‌భుత్వ భాగ‌స్వామిగా ఉంటాం: స‌త్య నాదెళ్ల‌

image

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉంటామని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల తెలిపారు. HYDలో ఆయ‌న‌తో సీఎం రేవంత్ బృందం భేటీ అయింది. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక‌ వ‌స‌తులే ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డి HYDను ప్రపంచంలోని టాప్-50 నగరాల్లో ఉంచగలవని స‌త్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నందుకు ఆయనకు సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

News December 30, 2024

భారత్‌కు WTC ఫైనల్ అవకాశాలు ఉన్నాయా?

image

బాక్సింగ్ డే టెస్టులో ఓడిన భారత జట్టు WTC ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా తర్వాతి టెస్టులో గెలవాలి. మరోవైపు AUSతో జరిగే టెస్టు సిరీస్‌లో శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలవాలి. దీంతో పర్సంటేజ్ పరిగణనలోకి తీసుకుంటే భారత్ ఫైనల్ చేరనుంది. భారత్ నెక్స్ట్ టెస్టులో గెలిచినా శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ డ్రాగా ముగిస్తే కనుక ఫైనల్ చేరే అవకాశాలు తక్కువే. మరోవైపు వచ్చే టెస్టులో భారత్ ఓడినా, డ్రా చేసుకున్నా ఫైనల్ చేరదు.