News September 21, 2024

శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు

image

ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 28 వరకు పొడిగించినట్లు డీఈవో తిరుమల చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 200 అపరాధ రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో గాని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో గాని సంప్రదించాలని కోరారు.

Similar News

News November 9, 2025

శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News November 8, 2025

మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

image

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.

News November 8, 2025

టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

image

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.