News September 21, 2024

MBNR: బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే యెన్నం ఫైర్

image

BRSపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. BRS పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలుగా విడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. PAC ఛైర్మన్ పదవికి నలుగురిలో అరెకపూడి ఎవరు నామినేషన్ వేయించారో చెప్పాలన్నారు. పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు గులాబీ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ పీఏసీ ఛైర్మన్ అవ్వడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఫైర్ అయ్యారు.

Similar News

News September 21, 2024

MBNR: UPDATE.. ఓటర్ల వివరాలు ఇలా.!

image

మహబూబ్ నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీల్లో 3,838 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఈనెల 28న తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు గ్రామాల్లో, పట్టణాల్లో కసరత్తులు చేపట్టారు. ఈ నెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేయగా.. దాని ప్రకారం 5,16,062 మంది ఓటర్లు ఉన్నారు. 2,57,477 మంది పురుషులు, 2,58,578 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 1,101 మంది మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

News September 21, 2024

తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర ఎనలేనిది: మాజీ మంత్రి

image

తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎనలేనిదని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన ఉపన్యాసాల పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని వెల్లడించారు.

News September 21, 2024

NGKL: దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

image

బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కుచుకూళ్లను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప స్థానంలో ఉంచినందుకు నాగర్ కర్నూల్ ప్రజలకు, తనను గుర్తించి గౌరవ సత్కారం చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.