News September 21, 2024

తిరుమలలో అలా జరగడం ఘోరం, నికృష్టం: మోహన్ బాబు

image

‘తిరుమల లడ్డూ’ వివాదంపై నటుడు మోహన్‌బాబు ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా వర్సిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని నాతో పాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ నిత్యం భక్తితో నమస్కరిస్తుంటాం. అక్కడ ఇలా జరగడం ఘోరాతి ఘోరం, నికృష్టం, హేయం, అరాచకం. నేరస్థుల్ని శిక్షించాలని నా మిత్రుడు, AP CM చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News September 22, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: సెప్టెంబర్ 22, ఆదివారం
✒ బ.పంచమి: మధ్యాహ్నం 3.43 గంటలకు
✒ కృత్తిక: రాత్రి 11.02 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 11.49 నుంచి 01.18 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్రం 4.25 నుంచి 5.14 గంటల వరకు

News September 22, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: ఈ నెల 25న వరద బాధితులకు సాయం: CBN
* రేపటి నుంచి DY.CM పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష
* జగన్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా?: హోం మంత్రి అనిత
* బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి రాంబాబు
* TG: ITIల సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలి: CM రేవంత్
* గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ: మంత్రి పొంగులేటి
* అమృత్ పథకంలో రేవంత్ ఫ్యామిలీ అవినీతి: కేటీఆర్
* ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణ స్వీకారం

News September 22, 2024

ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్

image

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 202 రన్స్‌కే ఆలౌటైంది. ఆ జట్టులో స్మిత్ (49) టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, హేజిల్‌వుడ్, హార్డీ, మ్యాక్స్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఐదు వన్డేల సిరిస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంతో నిలిచింది. తొలి వన్డేలోనూ ఆ జట్టు గెలిచింది.