News September 21, 2024
లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లకు కేరళకు సంబంధం ఏంటి?

లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల ఘటనలో కేరళలో పుట్టిన, నార్వే సిటిజన్ రిన్సన్ జోస్(36) పేరు వినిపించింది. బల్గేరియాకు చెందిన నార్టా గ్లోబల్ కంపెనీకి జోస్ యజమాని. పేజర్‌లను తైవానీస్ సంస్థ గోల్డ్ అపోలో ట్రేడ్‌మార్క్‌తో BAC కన్సల్టింగ్ అనే హంగేరియన్ కంపెనీ తయారు చేసింది. అయితే వాటిని జోస్ సంస్థ ద్వారా కొనుగోలు చేశారనే వార్తలొచ్చాయి. బల్గేరియా జాతీయ భద్రత ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది.
Similar News
News November 10, 2025
ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. నేరుగా లైసెన్స్!

AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల(RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు.
News November 10, 2025
అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News November 10, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.


