News September 21, 2024
BREAKING: దేవుడా క్షమించు: పవన్ కళ్యాణ్

AP: తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఏడుకొండల వాడిని క్షమించాలని కోరారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటి వాటికి పాల్పడుతారన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోతే హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. పాప నివారణగా రేపు ఉదయం కాకానిలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల దీక్ష చేపడుతానని తెలిపారు.
Similar News
News November 18, 2025
హిడ్మా మృతదేహం (photo)

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు <<18318593>>హిడ్మా<<>> ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం కాగా ఆయన మృతదేహం ఫొటో బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

కడుపులోనే కవలలు, భార్య మృతి.. భర్త ఆత్మహత్య

AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విజయ్-శ్రావ్య దంపతుల కథ విషాదాంతమైంది. 8 ఏళ్ల క్రితం పెళ్లి కాగా HYDలో అద్దెకు ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో IVF ద్వారా శ్రావ్య గర్భం దాల్చింది. 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా గర్భంలోని కవలలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా చనిపోయింది. ఈ విషాదాన్ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.