News September 21, 2024

లడ్డూలో జంతువుల కొవ్వు వాడలేదు: సజ్జల

image

AP: చంద్రబాబు దేవుడితో రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ‘జూన్ 12న శాంపిల్స్ తీసుకుంటే 23న రిపోర్ట్ వచ్చింది. తిరుమలలో ల్యాబ్ లేదని చెబుతున్నారు. తిరుమల ల్యాబ్ అడ్రస్‌తో రిపోర్ట్ వచ్చింది. అది ఎలా సాధ్యం?. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వాడినట్లు రిపోర్టుల్లో లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 11, 2026

ఈనెల 15 నుంచి 22 వరకు సింగోటం బ్రహోత్సవాలు

image

కొల్లాపూర్ మండలంలోని సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహోత్సవాలు ఈనెల 15 నుంచి 22 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ స్వయంభు లింగ రూపంలో విగ్రహం ఉండటంతో లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంగా పేరు పొందింది. రెండో యాదాద్రిగా పిలవబడుతున్న ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో జటప్రోలు సంస్థాన రాజు సురభి నర్సింగ భూపాలుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

29, 30న ఉప లోకాయుక్త క్యాంప్ సిట్టింగ్

image

విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీ ఉప లోకాయుక్త పి.రజని ఆధ్వర్యంలో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఈ క్యాంప్‌లో పాల్గొని ప్రభుత్వ అధికారుల అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై కొత్త ఫిర్యాదులు అందజేయవచ్చునని ఆమె తెలిపారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జరిగే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.