News September 21, 2024

జనవరిలో బీచ్ ఫెస్టివల్: దుర్గేశ్

image

AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్‌ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్‌ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.

Similar News

News February 19, 2026

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

image

ఉచిత పథకాల వల్ల ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని గుర్తుచేసింది. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాలూ ఉచితాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. ఆ సొమ్మును ప్రణాళికాబద్ధంగా వాడాలని సూచించింది. DMK ఉచిత విద్యుత్‌ ప్రతిపాదనల పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News February 19, 2026

తెలుగు రాష్ట్రాల తీరుపై CWC అసంతృప్తి

image

TG: జలవివాదాల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల వైఖరిపై CWC అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇవ్వాల్సిన అజెండాను AP, TG పంపకపోవడంతో JAN 30న జరిగిన భేటీ నిర్ణయాలు లేకుండానే ముగిసింది. తదుపరి భేటీకి 10 రోజుల్లో అజెండా పంపిస్తామని రెండూ అప్పట్లో చెప్పాయి. అయితే 20 రోజులైనా వాటి జాడలేదు. దీనిపై కమిషన్ సీరియస్‌ అయినట్లు సమాచారం. దీనిపై TG అధికారులు స్పందిస్తూ నెలాఖరుకు అందిస్తామని తెలిపారు.

News February 19, 2026

మదనపల్లె మృగాడికి మరణం తర్వాతా శిక్ష

image

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబం నిరాకరించింది. నిన్న పోస్టుమార్టం రిపోర్టుపై సంతకానికి సైతం రాకపోవడంతో అతడి పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు బాడీ కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేయనున్నారు. కాగా 7సం.ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ కులవర్ధన్, శిక్ష భయంతో చెరువులో దూకి చనిపోయాడు.