News September 21, 2024

JKకు రాష్ట్ర హోదా మా ప్రాధాన్యం: కాంగ్రెస్‌

image

జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదా క‌ల్పించ‌డ‌మే త‌మ మొద‌టి ప్రాధాన్య‌మ‌ని కాంగ్రెస్ తెలిపింది. జ‌మ్మూలో ఆ పార్టీ అధ్యక్షుడు ఖ‌ర్గే మాట్లాడుతూ JKకు కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీల్లో రాష్ట్ర హోదా మొద‌టి ప్రాధాన్య‌మ‌న్నారు. అలాగే ప్ర‌తి కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా క‌ల్పిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు బీజేపీ చేసిందేమీ లేద‌ని, ఉద్యోగాల పేరుతో యువ‌త‌ను వంచించింద‌ని ఖ‌ర్గే విమ‌ర్శించారు.

Similar News

News September 22, 2024

లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమే: రఘురామ

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా భక్తులు అంటున్న మాట వాస్తవమేనని MLA రఘురామకృష్ణరాజు అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కోసం కల్తీ నెయ్యికి జగన్ అనుమతించారని ఆరోపించారు. 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి పాలకులు వెళ్లలేదని అన్నారు. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసేలా CM చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

News September 22, 2024

గూగుల్‌పై చర్యలకు సిద్ధమవుతున్న EU

image

యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి గూగుల్‌కు మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌ప్పేలా లేదు. సెర్చ్ ఇంజిన్‌లో అన్ని సంస్థ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే విష‌యంలో గూగుల్ వేగంగా స్పందించ‌క‌పోతే భారీ జ‌రిమానాతోపాటు బిజినెస్ మోడ‌ల్ మార్పుల‌పై ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉన్నట్టు EU అధికారులు చెబుతున్నారు. గూగుల్ ఫ్లైట్స్‌, హోటల్స్ వంటి స‌ర్వీసుల్లో గూగుల్ సెర్చ్‌లో చూపించే ఫ‌లితాల స‌ర‌ళికి వ్య‌తిరేకంగా ఈయూ ఛార్జిషీట్ సిద్ధం చేస్తోంది.

News September 22, 2024

సింహాచలం అప్పన్న ఆలయంలో నెయ్యి సీజ్

image

AP: విశాఖ జిల్లాలోని ప్రముఖ సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. నెయ్యి, లడ్డూలో వాడే ఇతర పదార్థాల శాంపిల్స్‌ని సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.