News September 21, 2024

NTR ‘దేవర’ సినిమాకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

image

AP: రాజకీయాలకు అతీతంగా తెలుగు చిత్ర సీమకు మంచి జరగాలని చంద్రబాబు కూటమి నాయకత్వం కోరుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేవర సినిమాకు టికెట్ల పెంపుపై ఆయన స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ నిర్మాతలు, నటులు పడిన కష్టాలు తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. తామెప్పుడూ సినీ పరిశ్రమను వైసీపీ నేతల్లా ఇబ్బందులకు గురిచేయబోమని పేర్కొన్నారు. దేవర విడుదలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News November 11, 2024

EPFO: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్రం?

image

EPFO గరిష్ఠ వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ వెల్లడించింది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12%, యజమాని వాటా 12% చెల్లిస్తారు. వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగుల భవిష్య నిధికి జమయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది. చివరిసారిగా 2014లో రూ.6,500గా ఉన్న వేజ్ సీలింగ్‌ను రూ.15వేలకు కేంద్రం పెంచింది.

News November 11, 2024

DANGER: పిల్లలకు కూల్‌డ్రింక్స్ కొనిస్తున్నారా?

image

పిల్లలకు కూల్ డ్రింక్స్ కొనివ్వొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తయారీదారులే కార్బోనేటెడ్ శీతల పానీయలను పిల్లలకు సిఫార్సు చేయొద్దని వాటిపై రాస్తున్నారని తెలిపారు. పిల్లలు కెఫిన్ కలిపిన సోడాను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, మద్యం తాగాలనే ఆలోచనలు రావడం, అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

News November 11, 2024

కొడుకు కాదు క్రూరుడు.. అమ్మను రోడ్డుపై వదిలేశాడు

image

AP: కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. తీవ్ర వినికిడి లోపం ఉన్న ఆమెను మరో ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి(D) సోమందేపల్లిలో జరిగింది. తన బిడ్డ భోజనం తెచ్చేందుకు వెళ్లాడని ఆమె దీనంగా రోడ్డు పక్కన కూర్చుండిపోయింది. స్థానికులు ఆమెకు భోజనం, నీరు అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఓ వృద్ధాశ్రమానికి తరలించారు.